బ్రెడ్డుతో తియ్యటి గులాబ్ జామూన్



తెల్లని బ్రెడ్ ముక్కలు - ఎనిమిది
పంచదార - ఒక కప్పు
మిస్క్ పౌడర్ - రెండు స్పూన్లు
ఫ్రెష్ క్రీమ్ - రెండు స్పూన్లు
వేడి పాలు - అయిదు స్పూన్లు
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
యాలకుల పొడి - అరస్పూను

పంచదార సిరప్‌ను ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి.

బ్రెడ్డు ముక్కలను మిక్సీలో పొడి కొట్టుకోవాలి.

ఆ పొడిలో పాలపొడి, ఫ్రెష్ క్రీమ్, పాలు వేసి ముద్దగా కలుపుకోవాలి.

ఆ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి.

స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడెక్కాక అందులో ఈ ఉండలను వేసి వేయించాలి.

బ్రౌన్ రంగులోకి మారాక తీసి పంచదార సిరప్ లో వేయాలి.

పంచదార సిరప్‌లో దాదాపు రెండు గంటల పాటూ ఉంచితే మెత్తగా మారతాయి గులాబ్ జామూన్లు.