అందం, అభినయం కలబోసినట్లుగా ఉండే సాయి పల్లవి బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? ఆత్మ విశ్వాసమే నిజమైన అందం అంటోంది ఈ ముద్దుగుమ్మ. సాయి పల్లవి రొసెసియా అనే వ్యాధితో పోరాడుతోంది. అందుకే ఆమె మొహం మీద మొటిమలు, ఎర్రటి మచ్చలు ఎక్కువ. కానీ, ఆ ఎర్రని మచ్చలే ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేస్తున్నాయి. ఉంగరాలు తిరిగిన పొడవైన జుట్టు సాయి పల్లవికి మరింత అందం తెచ్చి పెడుతుంది. తన స్కిన్, జుట్టు ఇంత అందంగా ఉండటానికి కారణం.. వారానికి మూడు సార్లు ఎక్సర్ సైజ్ చేయడమే అని చెప్పింది. ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటానని ఆమె తెలిపింది. హాయిగా నవ్వితే చర్మ సమస్యలన్నీ పారిపోతాయని ఈ హైబ్రిడ్ పిల్ల పేర్కొంది. ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండటం తన అందం మరో సీక్రెట్ అని సాయి పల్లవి చెప్పింది. తన మొహం మీద మచ్చలు ఉన్నప్పటికీ మేకప్ లేకుండా నటించేందుకు సాయి పల్లవి ఆసక్తి చూపిస్తుంది.