సమంత తినే ప్లేటులో ఏముంటాయంటే... సమంత డైట్ వెరీ స్పెషల్. ఫిట్నెస్‌గా ఉండేందుకు ఆమె ప్రాముఖ్యతనిస్తారు. అందుకే బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్లలో పోషకాహార నిపుణుల చెప్పిన ఆహారాన్ని తింటుంది సమంత. బ్రేక్‌ఫాస్ట్‌లో అవకాడో, ఉడకబెట్టిన గుడ్లు తింటుంది. ఇక లంచ్‌లో చేపలు, మటన్, మిల్లెట్స్‌తో వండిన వంటకాలు తినేందుకు ఇష్టపడుతుంది. డిన్నర్లో కూరగాయలు, చేపలు, మిల్లెట్స్, మటన్‌తో వండినవి తింటుంది. లంచ్ - డిన్నర్ మధ్య సాయంత్రం పూట ఉడకబెట్టిన గుడ్లు, ఉడకబెట్టిన ఎర్ర దుంపలు తింటుంది. సమంతకు స్పైసీ ఫుడ్ ఆహారం. బిర్యానీ, రొయ్యలు ఇష్టంగా తింటుంది. ప్రతిరోజు కచ్చితంగా డైట్ పాటించే సమంత, ఆదివారం మాత్రం తనకు నచ్చిన చీట్ మీల్ తింటుంది.