ఈ దీపావళికి స్పాంజి రసగుల్లాతో నోరు తీపి చేసుకోండిలా



పాలు - ఒక లీటరు
నిమ్మరసం - అరస్పూను
పంచదార - రెండు కప్పులు
నీళ్లు - ఒక లీటరు
యాలకుల పొడి -అరస్పూను

పాలను మరగబెట్టి నిమ్మరసం వేసి విరగ్గొట్టాలి.

ఒక వస్త్రంలో పాలను వడకట్టి, గట్టిగా మూటలా కట్టి కాసేపు ఉంచాలి.

నీరంతా పోయాక ఆ ముద్దని చేతులతో బాగా నొక్కి మెత్తటి పేస్టులా చేసుకోవాలి.

తరువాత గుండ్రని ఉండలుగా చుట్టుకోవాలి.

మరోపక్క రెండు కప్పుల పంచదార, ఒక లీటరు నీళ్లు వేసి మరిగించాలి.యాలకుల పొడి వేయాలి.

పంచదార కరిగి సలసల మరుగుతున్నప్పుడు అందులో ముందుగా చుట్టుకున్న ఉండలను వేసి మూత పెట్టేయాలి.

ఓ పది నిముషాల తరువాత మూత తీసేసి, స్టవ్ కట్టేయాలి.

నాలుగైదు గంటలు తరువాత తింటే స్పాంచి రసగుల్లా నోట్లో కరిగిపోతుంది.