క్యారెట్లలో బీటా కెరోటిన్, కెరొటీనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి. కాలేయ వ్యర్థాలని తొలగించేందుకు నిమ్మకాయ బాగా పని చేస్తుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉన్నాయి. యాపిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కాలేయంలోని విషవ్యర్థాలని తొలగించి అనారోగ్యాల బారిన పడకుండా రక్షిస్తుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణగా నిలుస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కాలేయాన్ని ఆక్సీకరణ నష్టం నుంచి తప్పిస్తాయి. వాల్ నట్స్ శరీరంలోని వ్యర్థాలని బయటకి పంపడంలో సహాయకారిగా ఉంటుంది. అధిక మొత్తంలో అర్జినిన్ కలిగి ఉంటుంది. అధిక మొత్తంలో విటమిన్ ఏ, సి, కె, కాల్షియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. క్యాన్సర్ కారకాలని తొలగిస్తాయి. దబ్బపండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సహజసిద్ధంగానే లివర్ ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తాయి. స్ట్రాబెర్రీస్ లేదా కాన్ బెర్రీస్ వంటి వాటిలో ఆంథైకోనిసిస్ ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తుంది. రెడ్, పర్పుల్ ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాలేయంలో కొవ్వు పట్టకుండా ఇందులోని గుణాలు అడ్డుకుంటాయి.