డెంగ్యూకి చెక్ పెట్టే కివీ పండ్లు డెంగ్యూ మళ్లీ విస్తరిస్తోంది. చాలా మంది డెంగ్యూ జ్వరం బారిన పడుతున్నారు. డెంగ్యూ జ్వరం వచ్చి కోలుకున్నాక కూడా కనీసం నెల రోజుల పాటూ రోజూ కివీ పండ్లు రెండైనా తినాలి. కివీలో అధిక స్థాయిలో విటమిన్ సి, డైటరీ ఫైబర్ ఉంటుంది.రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి వైరస్‌తో పోరాడే శక్తిని ఇస్తాయి. దీన్ని తినడం వల్ల రక్తపోటు పెరగదు. బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు వంటివి తగ్గుతాయి. రోజుకు రెండు కివీ పండ్లు తింటే చాలు డెంగ్యూ వైరస్‌ను తట్టుకునే శక్తి శరీరానికి వస్తుంది. వైరస్ సోకినా శరీరం పోరాడుతుంది. కివీలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండెకు రక్షణ లభిస్తుంది.