గీతూ బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి కారణాలేంటి?

ABP Desam

టాప్ 5 కంటెస్టెంట్ అనుకుంటే 9వ వారమే బయటికి వచ్చేసింది.

ABP Desam

ఆమె ఎలిమినేషన్‌కు ప్రధాన కారణం ఆమె యాటిట్యూడ్ అనే చెప్పాలి. ఆమె ఆట ఆడే తీరే కాదు ప్రవర్తన కూడా ఇంట్లో ఉండే వారాలను నిర్ణయించింది.

ABP Desam

గీతూ ఇంట్లో కొన్ని పనులు చేయనని మొండికేసి కూర్చుంది. పనిచేయమంటే వాదించేది. ఆ వాదించడం కూడా చూసే ప్రేక్షకులకు ఇరిటేట్ కలిగించేలా ఉండేది.

ABP Desam

బిగ్‌బాస్ చెప్పినవి కూడా వినకపోవడం ఆమెకు మైనస్ అయింది. ఆ సమయంలో గీతూ తానే బిగ్‌బాస్‌లా ఫీలయ్యేది.

ABP Desam

సంచాలక్‌గా తానే ఆడడం వివాదంగా మారింది. తానుండే సీజన్ బావుండాలని ఆడించానని చెప్పింది. దానికి నాగార్జున బాగా తిట్టారు.

ABP Desam

‘ఆడించడానికి నువ్వెవరు?’ అని అడిగారు నాగ్. గీతూ ప్రతి దానికి ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించడం, ఓవర్ చేష్టలు చేయడం ఆమెపై ప్రేక్షకులకు విరక్తి వచ్చేలా చేసింది.

ABP Desam

బాలాదిత్య సిగరెట్ల వ్యవహారం కూడా ఆమెపై నెగిటివిటీ పెంచింది. చలాకీ చంటి గొడవ కూడా ఆమెపై నెగిటివ్ ఎఫెక్ట్ పడేలా చేశాయి.

ABP Desam

ముఖ్యంగా ప్రేక్షకులతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వలేకపోయింది గీతూ.

ABP Desam

ఆటే ముఖ్యమని, అమ్మానాన్న కూడా తరువాతే అని చెప్పింది. ఏ ఎమోషన్స్ లేని రాయిలా ఆమె ఉండడం వల్ల ప్రేక్షకులకు నచ్చలేదు.

ABP Desam