సమంత.. సినిమాలతోనే కాదు, వ్యక్తిగత జీవితం కూడా నిత్యం వార్తల్లో ఉంటోంది. తనకు ‘మయోసిటిస్’ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు కొద్ది రోజుల క్రితం వెల్లడించింది. ఈ నేపథ్యంలో తన హెల్త్ గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించింది. తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల పట్ల ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఉన్న స్టేజిలో ప్రాణాపాయం లేదని చెప్పింది. ప్రస్తుతానికైతే నేను చావలేదంటూ కంటతడి పెట్టుకుంది. వ్యాధి నుంచి బయటపడేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్లు వివరించింది. సమంతా తాజాగా విడుదల చేసిన ఫోటోల్లో చాలా నీరసంగా కనిపిస్తోంది. Photos Credit: Samantha/Instagram/twitter