తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు రష్మి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘జబర్దస్త్‘ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ‘గుంటూరు టాకీసు‘ సినిమాతో వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా యువతను బాగానే ఆకట్టుకున్నా పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించింది. తాజాగా నటించిన ‘బొమ్మ బ్లాక్ బస్టర్‘ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో సముద్రపు ఒడ్డున పడవపై నిల్చొని ఎంజాయ్ చేస్తున్న వీడియోను రష్మి పోస్టు చేసింది. Photos & Video Credit: Rashmi Gautam/ Instagram