'హలో' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కళ్యాణి ప్రియదర్శన్. ఆ తరువాత 'చిత్రలహరి', 'రణరంగం' వంటి సినిమాల్లో నటించింది. ఇటీవల ఈ బ్యూటీ నటించిన 'మానాడు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో కళ్యాణి ప్రియదర్శన్ ఇండస్ట్రీలో మరింత బిజీ అయింది. ఎక్కువగా తమిళ, మలయాళ చిత్రాల్లోనే నటిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఫొటోషూట్ లో పాల్గొంది. వాటిని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కళ్యాణి ప్రియదర్శన్ లుక్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. ఆమెని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. కళ్యాణి ప్రియదర్శన్ ఫొటోలు