సురభి పురాణిక్.. తెలుగులో హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. 'ఇవన్ వేరే మాదిరి' అనే తమిళ మూవీతో సినీ కెరీర్ మొదలు పెట్టింది. 2015లో ‘బీరువా’ మూవీతో తెలుగులోకి అడుగు పెట్టింది. తెలుగులో చేసిన తొలి సినిమా ఈ ముద్దుగుమ్మకు పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత నటించిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా హిట్ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. ఒక్కక్షణం, ఎటాక్, జెంటిల్ మేన్, ఓటర్, శశి మూవీస్ లో నటించింది. తమిళంలోనూ సురభి పలు సినిమాలు చేసినా, పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ గడ్డిపూలను తడిమి పరవశిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. Photos & Video Credit: Surbhi Puranik/Instagram/twitter