Image Source: pexels.com

యాంటీఆక్సిడెంట్లు,ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నఎండు ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Image Source: pexels.com

నానబెట్టుకుని తిన్నా, స్నాక్స్ , సలాడ్స్ రూపంలో తీసుకున్నా మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను అందిస్తుంది.

Image Source: pexels.com

ఎండుద్రాక్షల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి మీ కణాలను రక్షిస్తాయి.

Image Source: pexels.com

గుండె జబ్బులు, క్యాన్సర్, అల్జీమర్స్ వ్యాధి వంటి దీర్ఘకాలిక వ్యాధుల అభివృద్ధికి దోహదం చేస్తాయి.

Image Source: pexels.com

ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మలబద్దకాన్ని నివారించడంతోపాటు గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

Image Source: pexels.com

ఎండు ద్రాక్షలో ఐరన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ B6 వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి

ఇందులో ఉండే కాల్షియం బలమైన ఎముకలు, దంతాలకు మేలు చేస్తుంది.



Image Source: pexels.com

పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో, విటమిన్ B6 మెదడు పనితీరు, శక్తి జీవక్రియకు సహాయపడతాయి.

Image Source: pexels.com

ఎండుద్రాక్షల్లో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. మితంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

Image Source: pexels.com

ఎండుద్రాక్షలో చక్కెర ఎక్కువగా ఉన్నప్పటికీ, కావిటీస్, చిగురువాపును నిరోధించడంలో సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.