2023 బతుకమ్మ పండుగ తేదీలివే



ఏటా ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.



అక్టోబర్ 14 - మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ పితృ అమావాస్య (మహాలయ అమావాస్య – భాద్రపద అమావాస్య) రోజు జరుగుతుంది.



అక్టోబర్ 15 - రెండో రోజు అటుకుల బతుకమ్మ ఇది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి (నవరాత్రి కలశ స్థాపన) రోజు జరుపుకుంటారు



అక్టోబర్ 16- ఆశ్వయుజ శుద్ధ విదియ రోజు ముద్దపప్పు బతుకమ్మ



అక్టోబర్ 17 - ఆశ్వయుజ మూడోరోజైన తదియ రోజు నానేబియ్యం బతుకమ్మ



అక్టోబర్ 18 - ఆశ్వయుజ మాసంలో నాలుగో రోజైన చవితి రోజు అట్ల బతుకమ్మ



అక్టోబర్ 19 - ఆశ్వయుజ మాసంలో పంచమి రోజు అలిగిన బతుకమ్మ



అక్టోబరు 20 - ఆశ్వయుజ మాసంలో షష్టి రోజు వేపకాయల బతుకమ్మ



అక్టోబరు 21 - ఆశ్వయుజ మాసం సప్తమి రోజు వెన్నముద్దల బతుకమ్మ



అక్టోబరు 22 - బతుకమ్మ పండుగ చివరి రోజు ఆఖరి రోజును సద్దుల బతుకమ్మ అంటారు.



బతుకమ్మలను సాధారణ రోజుల కంటే పెద్ద పరిమాణంలో తయారు చేసి నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ పండుగను దుర్గా అష్టమి రోజు జరుపుకుంటారు