వాస్తు: మినిమం పాటించాల్సిన వాస్తు నియమాలివే!



సొంత ఇల్లు అయితేనే వాస్తు నియమాలు పాటిస్తాం అద్దెంటికి అవసరం లేదు అనుకోవద్దంటారు వాస్తు నిపుణులు. అద్దె ఇంటి వాస్తు సరిగ్గా ఉన్నప్పుడే జీవితంలో ఎదుగుదల ఉంటుంది



సొంతింటి కల నెరవేరాలంటే అప్పటి వరకూ అద్దెకు ఉండే ఇల్లు కూడా వాస్తురీత్యా బావుండాలి.



ఈశాన్యంలో ద్వారం,గృహం మధ్యన ఖాళీ ఉండటం చాలా ముఖ్యం
ఆగ్నేయంలో వంట గది ఉండాలి



నైరుతిలో బాల్కనీ ఉండరాదు
ఇల్లు దిక్కులు క్రాస్ గా కాకుండా ఓ తీరుగా - సరిగా ఉండాలి



నైరుతి, దక్షిణ, పశ్చిమం వైపు మాస్టర్ బెడ్‌రూమ్ ఉందోలేదో చూసుకోవాలి, ప్రతి పోర్షన్ దీర్ఘ చతురస్త్ర ఆకారంలో ఉండాలి. వృత్తాకారంలో అస్సలు ఉండకూడదు



నైరుతి గదికి నైరుతిలో ద్వారం ఉండకూడదు. ఇంటి ఆవరణలో నూతులు, గోతులు వాస్తుకు అనుగుణంగా ఉండాలి



వీధిపోట్లు, రోడ్డునుంచి పల్లంగా ఉన్న ఇళ్లు మంచివికావు. కొన్ని వీధిపోట్లు కలిసొస్తాయి...



టాయ్‌లెట్లు దక్షిణ, పశ్చిమాల్లో ఉండటం మంచిది



అదే ఇంట్లో మీకన్నా ముందు అద్దెకు ఎవరున్నారు, వాళ్లకి కలిసొచ్చిందా మరింత నష్టపోయారా, ఏవైనా ఇబ్బందులు పడ్డారా...



యాక్సిడెంట్లు ఏమైనా జరిగాయా, ఇంకా అనారోగ్య సమస్యలు, ఆత్మహత్యలు, కుటుంబంలో కలహాలు ఏమైనా జరిగాయేమో తెలుసుకోవాలి.



గృహమే కదా స్వర్గసీమ అంటారు. అలాంటప్పుడు ఆ ఇంట్లో నివాసం ఉంటే అంతా మంచి జరగాలి కానీ అడుగుపెట్టగానే ఆందోళన కలగకూడదు. Images Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

భగవద్గీత: ఇలాంటివాళ్లెప్పుడూ ప్రశాంతంగా ఉంటారు!

View next story