కొబ్బరి నూనెతో సులభంగా పొట్ట తగ్గుతుందట. అంతేకాదు చాలా ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాం.

చర్మం, జుట్టు పోషణలో మాత్రమే కాదు కొబ్బరి నూనె కొవ్వును తగ్గించడంలో కూడా మంచి ఫలితాలు ఇస్తుంది.

ప్రతి రోజూ 14 గ్రాముల కొబ్బరినూనె తీసుకుంటే ఇది జీవ క్రియలను వేగవంతం చేస్తుంది.

కొబ్బరి నూనె ఆకలిని తగ్గిస్తుంది. కొబ్బరి నూనెలోని ఎంసీటీ లు తృప్తిగా అనిపించే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి.

కొబ్బరి నీళ్లలోని ఫైబర్ వల్ల పోర్షన్ కంట్రోల్ అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.

వర్కవుట్ కు ముందు కొబ్బరి నూనె తీసుకుంటే కండరాలకు తక్షణ శక్తి లభిస్తుంది.

కొబ్బరి నూనెలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

కొబ్బరి నూనె రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ఎక్కువ క్యాలరీలు కలిగిన ఆహారాల మీద కోరిక తగ్గిస్తుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels