ఆయుర్వేద మార్గంలో బరువు తగ్గడానికి మీకు సహాయపడే కొన్ని సాధారణ చిట్కాలు. ఆరోగ్యకరమైన జీవక్రియ కోసం తీసుకోవల్సిన ఆహారాలు ఏంటో చూద్దాం. రాత్రి తేలికపాటి ఆహారం తీసుకుంటే నిద్రపోయే ముందు మీ పొట్ట ఖాళీ అయ్యేలా చేస్తుంది. డైట్లో వెచ్చగా పొడిగా, తేలికగా, సులభంగా జీర్ణమయ్యే ఫుడ్ తీసుకోవాలి. వారంలో కనీసం 3 రోజులు వ్యాయామం చేయాలి. వ్యాయామం వేగవంతమైన జీవక్రియ రేటును సమర్థవంతంగా కొవ్వును బర్న్ చేస్తుంది. వేడినీరు లేదా వేడి టీ తాగితే విషపదార్థాలు తొలగిపోతాయి. ఆయుర్వేదం ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిద్రించాలి. త్రిఫలం మీ శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్సహిస్తుంది. ఆమ్లవ్యవస్థను క్లియర్ చేయడంలో, ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.