కొబ్బరిని అనేక విధాలుగా మనం ఇంట్లో వాడుకుంటూ ఉంటాం.

ముఖ్యంగా కొబ్బరి ముక్కలు, కొబ్బరి నీళ్ళు,కొబ్బరి పువ్వు, కొబ్బరి నూనెగా వాడుతుంటాం.

కొబ్బరి ఒంట్లోని కొవ్వును కరిగిస్తుందట.

అధిక బరువుతో బాధ పడుతున్నవారు కొబ్బరి తింటే బరువు తగ్గుతారు.

ఎముకలు బలంగా ఉంచేందుకు కొబ్బరి సహాయం చేస్తుంది.

కొబ్బరి ఒంటిలోని రోగనిరోధక శక్తి పెంచుతుంది, రక్త పోటును అదుపులో ఉంచుతుంది.

సోడా తాగే బదులు కొబ్బరి నీళ్ళు తాగడం ఎంతో ఉత్తమం.

ఇది శరీరానికి చల్లదనాన్ని అందించి హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

కొబ్బరి నూనెను తలకు రాసుకోవడం వల్ల జుట్టు కుదుళ్ళు బలపడతాయి.

దీనిని వంట నూనెగా కూడా ఉపయోగించచ్చు.