ఈరోజుల్లో షుగర్ రాని వాళ్ల తక్కువ. వచ్చాక అదుపు చేసుకునేందుకైనా, రాకుండా నివారించేందుకైనా కొన్ని జాగ్రత్తలు తప్పవు. ప్రాసెస్ చేసిన ఆహారం తినకూడదు. హోల్ గ్రెయిన్, హోల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. పిండి పదార్థాలు తగ్గించాలి. ఆహారం తీసుకునే విషయంలో పోర్షన్ కంట్రోల్ పాటించాలి. ఆరోగ్యవంతమైన బరువు కలిగి ఉండడం అవసరం. నీళ్లు ఎక్కువగా తాగాలి. శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు తప్పకుండా ఏదో ఒక వ్యాయామం చెయ్యాలి. సెడెంటరీ లైఫ్ స్టయిల్ చాలా అనారోగ్యాలకు దారి తీస్తుంది. అదే పనిగా ఎక్కవ సమయం పాటు కూర్చుని కూడా ఉండకూడదు. ఆహారం మీద పూర్తి దృష్టి నిలిపి మనస్పూర్తిగా తినడం అలవాటు చేసుకోవాలి. ఇది ఎక్కువ తినకుండా కాపాడుతుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే! Images courtesy: Pexels