బలహీనమైన జుట్టుకు మెంతులు ఎంతో మేలు చేస్తాయి. చాలామంది జుట్టు రాలడం, జుట్టు చిట్లిపోవడం, జుట్టు నెరసిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. మెంతిగింజలతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మెంతుల్లో ఐరన్, జింక్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఉంటాయి. మెంతులు జుట్టు ఆరోగ్యానికి అవసరమైన పోషణను అందిస్తాయి. మెంతుల్లో జుట్టు పెరుగుదలను ప్రేరేపించే కీలకమైన యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. మెంతుల మొలకల్లో పోషక పదార్ధాలు గణనీయంగా ఉంటాయి. వీటిని డైట్లో చేర్చుకుంటే జుట్టుకు మేలు చేస్తాయి మెంతుల మొలకలను సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. తరిగిన ఉల్లిపాయలు, టొమాటాలు, నిమ్మరసం, క్యారెట్‌లు, దోసకాయలు ఉప్పు వేసి ఉదయం తినాలి. జుట్టు సమస్యలే కాదు మలబద్ధకం, అసిడిటి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అయితే ఈ సమస్యలతో బాధపడేవారు రెండు వారాల కంటే ఎక్కువ తినకూడదు.