మీ పిల్లలు పిజ్జా కావాలని బాగా సతాయిస్తున్నారా? కానీ మీకు బయట ఫుడ్ పెట్టడం ఇష్టలేదా? అయితే మీరు బ్రెడ్ పిజ్జా చేసేయండి. ముందుగా బ్రెడ్స్ తీసుకుని.. వాటిపై పిజ్జా సాస్ అప్లై చేయాలి. ఉల్లిపాయ, టమాటా, కార్న్, క్యాప్సికమ్, పనీర్ ముక్కలను ఓ గిన్నెలోకి తీసుకోవాలి. వాటిలో బ్లాక్ పెప్పర్, సాల్ట్ వేసి ముక్కలకు కలిసేలా బాగా కలపాలి. పాన్‌పై బటర్ అప్లై చేసి చిన్న మంట మీద 10 నిమిషాలు ఉడికించాలి. బ్రెడ్‌పై ఈ మిశ్రమాన్ని ప్లేస్ చేయాలి. అనంతరం చీజ్ వేయాలి. అంతే బ్రెడ్ పిజ్జా రెడీ. దీనిపై చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో చల్లుకోవాలి.