జామకాయల్లో ఫోలిక్ యాసిడ్స్, పొటాషియం, మాంగనీస్ వంటి న్యూట్రియెంట్స్ ఉంటాయి. వీటిలో బి3, బి6 , ఫైబర్, ప్రోటీన్, కేలరీలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే వీటిని ఏ సమయంలో తినాలి? ఎప్పుడు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. జామకాయలను అన్నం తినడానికి అరగంట ముందు తీసుకుంటే మంచిది. అయితే కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం వీటిని తినకూడదట. ఆయుర్వేదం ప్రకారం జామకాయలు శరీరాన్ని కూల్‌గా ఉంచుతాయి కాబట్టి.. వీటిని మధ్యాహ్నం తీసుకుంటే మంచిది. మీరు లంచ్ చేసిన 2 గంటల తర్వాత వీటిని తీసుకోవచ్చు. రాత్రుళ్లు, ఉదయాన్నే వీటిని అస్సలు తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు. (Images Source : Pixabay)