మిరియాలు ప్రతీ ఇంట్లో ఉండే అతి సాధారణ మసాలా దినుసు. వంటకు రుచి పెంచడమే కాదు వీటితో బరువు కూడా తగ్గొచట. అదేలాగో తెలుసుకుందాం. మిరియాలతో జీవక్రియల వేగం పెరుగుతుంది. వీటిలోని ఫైపరిన్ వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. పైపరిన్ వల్ల విశ్రాంతి గా ఉన్నపుడు కూడా కొవ్వు తగ్గుతుంది. పైపరిన్ కొవ్వు నిల్వలు పెరగనివ్వదు. కనుక మిరియాలు తరచుగా తీసుకునే వారిలో బరువు అదుపులో ఉంటుంది. మిరియాలు కలిగిన ఆహారం తీసుకున్నపుడు పోషకాల శోషణ మెరుగ్గా ఉంటుంది. అందువల్ల శరీరం కొవ్వును సమర్థవంతంగా సంశ్లేషిస్తుంది. మిరియాలతో ఆకలి కూడా తగ్గుతుంది. పైపెరిన్ వల్ల కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. మిరియాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. మిరియాల్లో క్యాలరీలు కూడా తక్కువ. పెద్దగా క్యాలరీలు చేర్చకుండా రుచికరమైన ఆహారం తయారు చేసుకోవచ్చు. Representational Image : Pexels