డ్యాన్సుతో బరువు ఇట్టే తగ్గేస్తారు

నాటు నాటు పాట కోసం ఆరు రోజుల పాటూ రిహార్సల్స్ చేశామని, నాలుగు కిలోల బరువు తగ్గానని చెప్పారు రామ్ చరణ్.

డాన్స్ చేయడం ద్వారా ఆరు రోజుల్లోనే నాలుగు కిలోలు బరువు తగ్గడం అంటే మామూలు విషయం కాదు.

రోజుకి ఒక అరగంట పాటు డ్యాన్స్ చేయడం వల్ల 118 నుంచి 207 కేలరీలు కరుగుతాయి.

డ్యాన్స్ వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శరీరం స్టామినాను పెంచుతుంది.

శరీరమంతా చురుగ్గా కదిలేలా చేస్తుంది.

మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

శరీరం అంతటా రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తుంది డ్యాన్సు.

ఒత్తిడి, డిప్రెషన్ వంటివి రాకుండా అడ్డుకుంటుంది నాట్యం.