ఈ సమస్యలుంటే శెనగపప్పు తినకండి పండగలు వస్తే పూర్ణం బూరెలకు శెనగపప్పు కచ్చితంగా ఉండాల్సిందే. కానీ కొన్ని రకాల ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు మాత్రం శెనగపప్పును దూరం పెట్టాలి. పొట్ట నొప్పి వేధిస్తున్నప్పుడు శెనగపప్పుతో చేసిన వంటకాలను దూరం పెట్టాలి. గర్భంతో ఉన్నప్పుడు మహిళలు శెనగపప్పుతో చేసిన వంటకాలు అధికంగా తింటే పొట్టనొప్పి వచ్చే అవకాశం ఉంది. కొందరిని గ్యాస్, ఎసిడిటీ సమస్యలు అధికంగా బాధిస్తాయి. అలాంటివారు శెనగపప్పును దూరం పెట్టడం చాలా మంచిది. చిన్నపిల్లలకు, ముసలి వాళ్లకు కూడా శెనగపప్పుతో చేసిన వంటకాలు తక్కువగా పెట్టాలి. వీరిద్దరి జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. ఈ పప్పు జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. శెనగపప్పు తిన్న వెంటనే ఏదైనా తేడాగా అనిపించినా, అలెర్జీలా వచ్చినా తినడం మానేయాలి. వైద్యున్ని సంప్రదించాలి.