డయాబెటిస్ ఉంటే నల్లద్రాక్ష తినొచ్చా? నల్ల ద్రాక్ష తినవచ్చా? లేదా? అనేది చాలామంది మధుమేహం ఉన్న వారి సందేహం. ఆహార పదార్థాల గ్లైసమిక్ ఇండెక్స్ తెలుసుకొని తినడం డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చాలా ముఖ్యం. జీఐ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తింటే రక్తంలో అధికంగా గ్లూకోజ్ విడుదలవుతుందని అర్థం. నల్ల ద్రాక్ష జిఐ తక్కువగా ఉంటుంది. కాబట్టి దీని ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. ఇందులో ఉండే ఫైటో న్యూట్రియెంట్స్ మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయి. నల్ల ద్రాక్షలో 82% నీరే ఉంటుంది. కాబట్టి కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. వీటిని తినడం వల్ల తీపి తినాలన్న కోరిక కూడా తగ్గుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి మధుమేహం ఉన్న వారు ఎలాంటి భయం లేకుండా నల్లద్రాక్షను తినవచ్చు.