దివితా రాయ్ డ్రెస్ సెన్స్ అదుర్స్ విశాలమైన కళ్లు, పెదవులపై ఎప్పుడు విరిసే నవ్వే దివితా రాయ్ అందాన్ని మరింతగా పెంచుతాయి. మిస్ యూనివర్స్ పోటీలో టాప్ 16లో చోటు దక్కించుకుంది కానీ విజేత కాలేకపోయింది. దివితది కర్ణాటక. అక్కడ్నించి వెళ్లి ముంబైలో స్థిరపడింది ఆమె కుటుంబం. 2022లో మిస్ దివా యూనివర్స్ పోటీల్లో నిలిచింది. దీంతో మనదేశం తరుపున ప్రపంచ స్థాయిలో మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. ఈమె సామాజిక సేవకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఖాళీ సమయంంలో బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, పెయింటింగ్ వంటివి చేస్తుంది. పాటలు వినడమన్నా చాలా ఆసక్తి. దివితా రాయ్ డ్రెస్సింగ్ సెన్స్ కూడా అదిరిపోతుంది. (Image Credit: Divita Rai/Instagram)