చికెన్ VS ఫిష్: ఏది తింటే బెటర్? చేపలు, చికెన్ ఈ రెండింటిలో త్వరగా బరువు తగ్గాలి అంటే ఏది తినాలి? ఇక్కడ పరిశోధకులు చెబుతున్న జవాబు ఒకటే ...ఈ రెండింటిని మీ డైట్ లో చేర్చుకోవడం మంచిదే. ఈ రెండింటిలోనూ శరీరానికి అవసరమైన ప్రొటీన్లు ఉంటాయి. ఆ ప్రొటీన్ బరువు తగ్గేందుకు చాలా సహకరిస్తుంది. నూనెలో వేయించిన చికెన్, చేపలు తినడం వల్ల ఫలితం ఉండదు. కాబట్టి కూరలాగా ఉడకబెట్టుకొని తినడమే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వీటిని అధికంగా తింటే ప్రోటీన్ అధికంగా శరీరంలో నిల్వ అవుతుంది. దీని వల్ల బరువు పెరిగిపోతారు. కాబట్టి మితంగానే తినాలి. చికెన్ తో పోలిస్తే చేపలు అధికంగా తిన్న త్వరగా బరువు పెరగరు. కానీ చికెన్ అధికంగా తింటే మాత్రం త్వరగా బరువు పెరిగిపోతారు. వారానికి రెండుసార్లు చేపలు తింటే మంచిది. అలాగే చికెన్ కూడా వారానికి రెండు సార్లు మితంగా తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.