వంకాయ తినకపోతే మీకే నష్టం వంకాయ కూర అనగానే చాలా మంది ముఖం ముడచుకుంటారు. ఆ కూర తినకపోతే మీకే నష్టం. వంకాయ తినడంలో త్వరగా బరువు తగ్గుతారు. ఇది శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. వంకాయలో ఫొలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి6, బి3, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు గుండె పోటు, స్ట్రోక్ ముప్పు రాకుండా అడ్డుకుంటాయి. మధుమేహం ఉన్నవారు వంకాయ తినడం చాలా అవసరం. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. వంకాయలో నిండుగా ఫైబర్ ఉంటుంది. కాబట్టి పొట్ట త్వరగా నిండిపోయినట్టు అనిపిస్తుంది. శరీరంలోని విష పదార్థాలను వంకాయ తొలగిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో ఈ కూరగాయ ముందుంటుంది.