మినప్పప్పు - ఒక కప్పు బియ్యం - ఒక కప్పు నెయ్యి - రెండు స్పూనులు నీళ్లు - ఒక కప్పు పంచదార - ఒకటిన్నర కప్పు యాలకుల పొడి - అర స్పూను ఉప్పు - రుచికి సరిపడా
మినపప్పు, బియ్యం నాలుగ్గంటలు నానబెట్టి, మిక్సీలో రుబ్బి ఒక గంట పాటూ పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక అందులో బొంబాయి రవ్వ వేయించాలి.
ఆ బొంబాయి రవ్వలో ఒక గ్లాసు బాగా మరిగిన నీళ్లు వేసి ఉడికించాలి. గరిటెతో కలుపుతూనే ఉండాలి.
ఒక కప్పు పంచదార, ఒక స్పూను యాలకుల పొడి వేసి కలుపుతూనే ఉండాలి.
మిశ్రమం మందంగా అయ్యే దాకా ఉడికించాలి. ఆ మిశ్రమం చల్లారాక ఉండలుగా చుట్టుకోవాలి.
ఉండలను మినపప్పులో రుబ్బులో ముంచి వేడి నూనెలో వేసి వేయించుకోవాలి.
గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారాక తీసి పక్కన పెట్టుకోవాలి. ప్రసాదం బూరెలు సిద్ధమైనట్టే.