రక్తానికి బీట్ రూట్ చాలా అవసరం. ఇవి ఎర్రరక్తకణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. చిన్న బీట్ రూమ్ ముక్క, క్యారెట్ ముక్కలు, టమోటా ముక్కలు కలిపి కాస్త నీరు వేసి జ్యూస్ చేసుకోవాలి. పరగడుపున ఖాళీ పొట్టతో ఈ జ్యూస్ తాగితే మంచి ఫలితాలు వస్తాయి. చర్మంలో కూడా మెరుపు కనిపిస్తుంది. హైబీపీ ఉన్న వాళ్లు దీన్ని తాగితే బీపీ అదుపులో ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిస్తుంది. శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పేరుకుపోకుండా బీట్ రూట్ జ్యూస్ కాపాడుతుంది. దీని వల్ల గుండె జబ్బులు కూడా రావు. గర్భిణిలు ఈ జ్యూస్ తాగితే చాలా మంచిది. అవసరమైనంత ఫోలిక్ యాసిడ్ దీని ద్వారా బిడ్డకు చేరుతుంది. పిల్లలకు తాగించడం వల్ల వారిలో కంటి చూపు మెరుగవుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఐరన్ అధికంగా ఉంటాయి. నీరసం తగ్గుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు చురుగ్గా ఉంటారు. ఈ జ్యూస్ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది.