జూలై25 నుంచి 31 వార ఫలాలు



మేషం
ఈ వారం మేషరాశివారు ఆర్థిక సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. కొన్ని వివాదాలు వెంటాడతాయి.నూతన ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఈ వారం ఫలించవు. వ్యాపారాల్లో పెద్దగా మార్పులుండవు. ఉద్యోగుల బాధ్యతలు పెరుగుతాయి. ఓ శుభవార్త ఆనందాన్నిస్తుంది.



వృషభం
ఈ వారం మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది.ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం. స్నేహితుల సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి.



మిథునం
ఈ వారం అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేయగలుగుతారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించండి. మీ మాటతీరుతో ఎంతటివారినైనా కట్టిపడేస్తారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు.



కర్కాటకం
వృత్తి, వ్యాపారం, ఉద్యోగులకు ప్రోత్సాహకర సమయం ఇది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. ఓ సమస్య నుంచి బయటపడతారు. రాజకీయ వర్గాలకు శుభసమయం. ఆస్తిని వృద్ధి చేయాలనుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి.



సింహం
పెద్దల ఆశీర్వచనంతో ఓ పని పూర్తవుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. చెడు వ్యవహారాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు, వ్యాపారులకు కొన్ని అడ్డంకులు తొలగిపోతాయి.



కన్య
కన్యా రాశివారు ఈ వారం మొత్తం సంతోషంగా గడుపుతారు. శుభకార్యాలు జరిపించేందుకు ప్రణాళికలు వేస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి.



తుల
ప్రణాళికలు వేసుకున్నప్పటికీ కష్టపడితేనే పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఇంటి నిర్మాణయత్నాలు కలిసొస్తాయి. వ్యాపారం పుంజుకుంటుంది. ఉద్యోగులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.



వృశ్చికం
మీకు మంచి సమయం నడుస్తోంది. సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఆస్తుల వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరమ మర్యాదలుంటాయి. వ్యాపారం బాగా సాగుతుంది.



ధనుస్సు
ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. సమయానికి పనులు పూర్తిచేయలేరు. ఎప్పటి నుంచో వెంటాడుతున్న ఓ సమస్యకి పరిష్కార మార్గం కనుక్కుంటారు. వ్యాపారాల్లో లాభాలొస్తాయి. పెట్టుబడులు కలిసొస్తాయి. ఉద్యోగులకు ఇబ్బందులు తొలగిపోతాయి.



మకరం
కీలకమైన పనులు ఓ కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వాహనం, గృహం కొనుగోలు ప్రయత్నాలు కలిసొస్తాయి. రాజకీయ వర్గాలవారికి మంచి సమయం. ఉద్యోగులకు సమస్యలు తొలిగిపోతాయి. మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారు.



కుంభం
మీ పనితీరుతో గుర్తింపు పొందుతారు. ఆస్తుల వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే ఒకటికి రెండుసాక్లు ఆలోచించండి. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగులను వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి.



మీనం
ఉన్నతమైన ఆలోచనా విధానంలో లక్ష్యాలు చేరుకుంటారు. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులను కలుస్తారు. ఉద్యోగులకు ఒత్తిడి తొలగిపోతుంది.