ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో నేడు సైతం పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి

ఉపరితల ఆవర్తనం సగటు సుద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది.

తెలంగాణలో నేటి నుంచి 3 రోజులపాటు మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు

నేడు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, ఉమ్మడి వరంగల్, మెదక్ జిల్లాల్లో వర్షాలు

హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. ఒకట్రెండు చోట్ల నగరంలో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు వర్షాలు కురుస్తాయి.

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్న ఏపీ వెదర్ మ్యాన్

నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఈ రోజు తక్కువగానే వర్షాలుంటాయి.

కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం