తెలుగు రాష్ట్రాలలో పలు జిల్లాల్లో నేడు విస్తారంగా వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణలో నేటి నుంచి మూడు, నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం అల్పపీడనం ప్రభావం నేడు అధికంగా ఉండనుంది. నేటి నుంచి నాలుగు రోజులపాటు తెలంగాణలో వర్షాలు మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ లలో భారీ వర్షాలు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, యదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు భారీ వర్షాలు శ్రీకాకుళం జిల్లా పాలకొండ - టెక్కళి బెల్ట్, సోంపేట - ఇచ్చాపురం, ఏలూరు, కొనసీమ, విశాఖపట్నం జిల్లాలో వర్షాలు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. నేడు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి - సూళూరుపేట బెల్ట్ లో వర్షాలు పడతాయి.