తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి

ఏపీతో పాటు తెలంగాణలో కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం

ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షాలు

వరంగల్, హన్మకొండ, సిద్దిపేట జిల్లాలతో పాటు హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ లోనూ ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి

భారీ వర్ష సూచనతో పలు జిల్లాలకు నేడు సైతం ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి

వైజాగ్ నగరంతో పాటుగా అనకాపల్లి, పెందుర్తి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి

పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కొనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ నగరం శివారు ప్రాంతాలలో వర్షం పడుతుంది

రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు

ఎన్.టీ.ఆర్, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ