తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి.

తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవగా, ఏపీలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు

ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి కొమొరిన్ ప్రాంతం, మరాఠ్వాడా, మధ్య మహారాష్ట్ర వద్ద 0.9 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం

నేడు నిజామాబాద్‌తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు

హైదరాబాద్ ఉదయం మేఘాలతో ఉన్నా, మధ్యాహ్నానికి వేడి గాలులు. అక్కడక్కడా తేలికపాటి జల్లులు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి జల్లులు

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల చినుకులు పడతాయి

తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి

కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, ఎన్.టీ.ఆర్, పల్నాడు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు

నంద్యాల, కర్నూలు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు