ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది దక్షిణ బంగాళాఖాతంలో నుంచి ఏపీ దక్షిణ ప్రాంతం వరకు 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఏపీ, తెలంగాణ, యానాంలో ఆగస్టు 31 వరకు వర్షాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దక్షిణ కోస్తాంధ్రకు మోస్తరు వర్ష సూచన ఉండగా.. రాయలసీమ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో తేలికపాటి జల్లులు పడతాయని అధికారులు అంచనా వేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.