దక్షిణ ఝార్ఖండ్ ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ పై విస్తరించి ఉన్న తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుంది ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఉత్తర మధ్యప్రదేశ్ దిశగా కదులుతూ తీవ్రవాయుగుండం బలహీనపడే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మరో రెండు రోజులపాటు వర్షాలు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రెండు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.