ఈశాన్య, పరిసర ప్రాంతాలైన తూర్పు బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడింది అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ గఢ్ వైపు ప్రయాణిస్తోంది. నేడు, రేపు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా నేడు బలపడనుంది. తీరంలో గాలులు వేగంగా వీస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో ఒకట్రెండు చోట్ల నేడు, రేపు తేలికపాటి జల్లులు కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఉదయం వేళ చల్లగా ఉంటూ, మధ్యాహ్నానికి వాతావరణం పూర్తిగా వేడెక్కుతుంది.