ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారుతోంది.

మరికొన్ని గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయి.

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు

ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వర్షాలు

హైదరాబాద్ లో నైరుతి దిశ నుంచి గాలులు గంటకు 8 నుంచి 12 కి.మీ వేగంతో వీచనున్నాయి.

గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు

కొన్నిచోట్ల మరో 3 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో ఆదివారం నుంచి మరో మూడు రోజులు ఓ మోస్తరు వానలు

ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయి.