నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది దక్షిణ కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా ఉన్న సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది వీటి ఫలితంగా ఏపీ, తెలంగాణ, యానాంలో ఆగస్టు 31 వరకు వర్షాలు కురవనున్నాయి. ఆగస్టు 29న మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి హైదరాబాద్‌ను మేఘాలు కమ్మేశాయి. నగరంలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ ప్రాంతాల్లో నేటి నుంచి మరో మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు రాయలసీమలో అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం