బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది.

వాయవ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తుపాను వాయుగుండం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, యానాంలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి.

వికారాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో మరికొన్ని గంటల్లో వర్షాలు

కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆగస్టు 30 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందన్న ఐఎండీ

నేడు రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవనుంది

కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షం కురవనున్నాయని ఎల్లో అలర్ట్ జారీ

వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఆగస్టు 28 వరకు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.

భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు.