బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాలపై ప్రభావం తగ్గింది. వాయుగుండం ఉత్తర భారతదేశం వైపుగా కదులుతోంది. కనుక ఏపీ, తెలంగాణలో 2 రోజులు వర్షాలు తక్కువ ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి ఉత్తర తెలంగాణలో పలు జిల్లాల్లో, రంగారెడ్డి జిల్లాలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి నేడు సైతం హైదరాబాద్ ను మేఘాలు కమ్మేస్తాయి. నగరంలో కొన్ని చోట్ల చిరు జల్లులు పడే ఛాన్స్ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్ష సూచన ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల వర్షాలు సెప్టెంబర్ 18 నుంచి మరో అల్పపీడనం ప్రభావం రాష్ట్రం పై మొదలవుతుందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు అనంతపురం, సత్యసాయి, కర్నూలు జిల్లాల్లో గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈ సారి మంచి వర్షాలే పడ్డాయి