నిన్నటి ద్రోణి ఈ రోజు ఛత్తీస్ గఢ్ లోని మధ్య భాగాల నుండి విదర్భ, తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా..



దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టంకి 0.9 కి మి ఎత్తు వద్ద కొనసాగుతూ ఉంది.



ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ రేపు, ఎల్లుండి కురిసే అవకాశం



కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ నేడు వర్షాలు



ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం



హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం



రాయలసీమ వ్యాప్తంగా విపరీతంగా వేడి, అత్యధికంగా కర్నూలులో ఉష్ణోగ్రతలు



రాయలసీమ జిల్లాల్లో రానున్న రోజుల్లో వేడి మరింత పెరగనుంది.