నేడు ఉత్తర - దక్షిణ ద్రోణి ఉత్తర ఛత్తీస్ గఢ్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతూ ఉందన్న వాతావరణ కేంద్రం అధికారులు రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం హైదరాబాద్ లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఏపీలో చాలా కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు పడే అవకాశం బలమైన గాలులు దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకూ వచ్చే అవకాశం కోస్తా భాగం మీదుగా గాలుల సంగమం, గాలిలో ఏర్పడే ఒత్తిడే వర్షాలకు కారణం