నిన్నటి ద్రోణి నేడు మధ్య చత్తీస్‌గఢ్ నుంచి విధర్భ తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా.. ఇంటీరియర్ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతూ ఉంది. నేడు తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షం, కొన్ని చోట్ల జల్లులు కురిసే అవకాశం రేపు (మార్చి 29న) తెలంగాణలో వాతావరణం పొడిగా ఉండనుందన్న వాతావరణ అధికారులు మార్చి 29 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 5 రోజులు వాతావరణం పొడిగా ఉండే అవకాశం హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఆగ్నేయ దిశల నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉరుములు, మెరుపులతో పాటు ఉత్తర కోస్తా, యానంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు పడే అవకాశం