నేడు ఉత్తర - దక్షిణ ద్రోణి/గాలి విచ్చిన్నతి దక్షిణ ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉత్తర ఇంటీరియర్ తమిళనాడు వరకు..



సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతూ ఉందన్న వాతావరణ కేంద్రం అధికారులు



నిన్న తూర్పు మధ్యప్రదేశ్ నుండి తెలంగాణ వరకు ఉన్న ద్రోణి /గాలి విచ్చిన్నతి, ఈరోజు బలహీన పడింది.



రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం



హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 36 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం



ఉత్తర దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం



ఏపీలో ఉరుములు, మెరుపులు లాంటి వాతావరణంతో పాటు బలమైన గాలులు దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకూ వచ్చే అవకాశం



వచ్చే 5 రోజుల పాటు ఇదే రకం వాతావరణ పరిస్థితి ఉంటుందని అంచనా