మధ్య చత్తీస్‌గఢ్ నుంచి ఉన్న ద్రోణి నేడు మరఠ్వాడ నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా.. దక్షిణ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతూ ఉందన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం నేటి నుంచి వాతావరణం తెలంగాణలో పొడిగా ఉండనుందన్న వాతావరణ అధికారులు మార్చి 29 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉండే అవకాశం మార్చి 31న మాత్రం తెలంగాణలో ఓ మోస్తరు నుంచి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఏపీలో నేడు ఉరుములు, మెరుపులతో పాటు బలమైన గాలులు దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకూ వచ్చే అవకాశం ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాలోని అన్ని జిల్లాల్లో ఈ రకమైన వాతావరణం ఉంటుందన్న వాతావరణ కేంద్రం