నిన్న ఉత్తర ఛత్తీస్ గఢ్ నుండి ఉన్న ద్రోణి/గాలి విచ్చిన్నతి, ఈ రోజు విదర్భ నుండి మరత్వాడ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా



దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతూ ఉందన్న ఐఎండీ అధికారులు



రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం



హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 36 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం



ఏపీలో చాలా కొన్ని చోట్ల బలమైన గాలులు దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకూ వచ్చే అవకాశం



రాయలసీమలో ఎండలు విపరీతం, నిన్న అత్యధికంగా కర్నూలు నగరంలో 40.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత



చిత్తూరు, కడప​, అనంతపురం, సత్యసాయి, నంద్యాల​, అన్నమయ్య జిల్లాల్లో కొనసాగనున్న ఎండల తీవ్రత



ఏప్రిల్ 6/7 నుంచి తెలంగాణలో వర్షాలు మొదలయ్యే సూచనలు కనబడుతూ ఉన్నాయి - ఏపీ వెదర్ మ్యాన్