జిల్లా ప్రజలు, కళాకారులు, కళాభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాళోజి కళాక్షేత్రంను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో కలిసి ప్రముఖ కవి కాళోజి నారాయణరావు నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని రేవంత్ ఆవిష్కరించారు.
హనుమకొండ, వరంగల్ జిల్లాలకు 4601 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపణలు, ప్రారంభోత్సవాలు చేశారు. కలాక్షేత్ర భవనాన్ని ప్రారంభించారు.
కాళోజి నారాయణరావు వ్యక్తిగత జీవితంలోని ప్రత్యేక క్షణాలను ప్రతిబింబించే ఫోటోలు, పురస్కారాలు, వ్యక్తిగత వస్తువులు ప్రదర్శించిన ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు.
కాళోజి ఫౌండేషన్ ప్రతినిధులు వీఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాస్ రావులు కాళోజి జీవితం అక్కడి వస్తువుల గురించి వివరించగా రేవంత్ రెడ్డికి ఆసక్తిగా తిలకించారు.
ఆడిటోరియంలో కాళోజి జీవిత విశేషాలతో నిర్మించిన లఘ చిత్రాన్ని కాళోజి ట్రస్ట్ ఫౌండేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం రేవంత్ విక్షించారు.
కాళోజి కళాక్షేత్రం ప్రారంభం - 90 కోట్లు, అండర్ డ్రైనేజీ వ్యవస్థ శంఖుస్థాపన - 4170 కోట్లు కేటాయించారు
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పాలిటెక్నిక్ కళాశాల, వరంగల్ పట్టణం రహదారుల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంఖుస్థాపన చేశారు