ములుగు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బొగత జలపాతం ఉప్పొంగుతూ పర్యాటకులను కనువిందు చేస్తోంది.

Published by: Shankar Dukanam
Image Source: https://telugu.abplive.com/

ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ములుగు జిల్లా జలపాతానికి నీటి ప్రవాహం భారీగా పెరిగింది.

Image Source: https://telugu.abplive.com/

ప్రకృతి అందాలతో పరవళ్లు తొక్కుతున్న ఈ జలపాతాన్ని వీక్షించేందుకు పలు జిల్లాల ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

Image Source: https://telugu.abplive.com/

హైదరాబాద్ నుంచి 440 కి.మీ. దూరంలో, వరంగల్ నుంచి 130 కిలోమీటర్లు, ఖమ్మం నుంచి 240 కిలోమీటర్లు, భద్రాచలం నుంచి 120 కి.మీ దూరంలో ఉంది.

Image Source: https://telugu.abplive.com/

నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటం, గతంలో ఇక్కడ వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

Image Source: https://telugu.abplive.com/

పర్యాటకుల భద్రత దృష్టిలో ఉంచుకుని అధికారులు బోగత వాటర్‌ఫాల్స్ వద్ద కఠిన ఆంక్షలు విధించారు.

బోగత జలపాతం సమీపంలోని నిషేధిత ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

Image Source: https://telugu.abplive.com/

పర్యాటకులు నీటిలోకి దిగకుండా, కేవలం దూరంగా ఉండి జలపాత అందాలను వీక్షించాలని సూచించారు.

Image Source: https://telugu.abplive.com/

ములుగు జిల్లా వాజేడు మండలం బోగత గ్రామంలో బోగత జలపాతం ఉంది. వాజేడు మండలం కేంద్రానికి 5 కిలోమీటర్లు దూరంలో ఉంది.

Image Source: https://telugu.abplive.com/